అక్షరటుడే, వెబ్డెస్క్ : Shri Ram Navami | హైదరాబాద్(Hyderabad) నగరం కాషాయమయమైంది. ఎటు చూసినా కాషాయ జెండాలే దర్శనమిచ్చాయి. భాగ్యనగరం వీధులన్నీ జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. ఆదివారం శ్రీరామ నవమి(Shri Ram Navami) సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.
సీతారాంబాగ్లో ప్రారంభమైన యాత్ర కోఠిలోని హనుమాన్ వ్యాయామ శాల వరకు సాగనుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ఆధ్వర్యంలో యాత్ర ఉత్సాహంగా సాగింది. 20 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.