అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైం పోలీసులు కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఆరు టీంలతో స్పెషల్‌ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా ముగ్గురు మాస్టర్‌ మైండ్స్, మరో 18 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. తెలంగాణలో చేసిన మోసాల్లో రూ.6.94 కోట్ల నగదును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై దేశవ్యాప్తంగా 435 కేసులు నమోదై ఉన్నాయి. నిందితుల నుంచి రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో నిందితుల ఖాతాల్లో ఉన్న కోటి రూపాయలకు పైగా నగదును ఫ్రీజ్‌చేశారు.