అక్షరటుడే, వెబ్‌డెస్క్:HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌ల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు యాజమాన్యం హెచ్‌సీఏపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాస్‌ల కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని యాజమాన్యం ఆరోపించింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తాజాగా హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందని, చర్యలు చేపట్టాలని అంబూడ్స్‌మన్ బీసీసీఐకి సూచించింది.
అన్ని జిల్లాల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేలా అభివృద్ధికి నిధులు కేటాయించాలని 2018, 2021లో బీసీసీఐ(BCCI) ఆదేశించింది. అయితే హెచ్‌సీఏ(HCA) ఆ ఆదేశాలు పాటించకుండా నిధులు దుర్వినియోగం చేసిందని అంబూడ్స్మన్కు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆగంరావు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్(BCCI Apex Council)కు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ చేపట్టిన కౌన్సిల్ హెచ్‌సీఏపై చర్యలు చేపట్టాలని బీసీసీఐకి సూచించింది.
గతంలో సైతం హెచ్‌సీఏ(HCA) నిధులు దుర్వినియోగం చేసిందని ఈడీ(ED) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పరికరాలు కొనుగోలు చేశారని ఈ ఏడాది మార్చిలో ఈడీ గుర్తించింది. ఈ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లు గుర్తించిన ఈడీ.. కీలక పాత్ర పోషించిన HCA మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌కు చెందిన రూ.51.29 లక్షల ఆస్తులను జప్తు చేసింది.