అక్షరటుడే, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం కామారెడ్డి, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ పేర్కొంది. గురువారం కామారెడ్డి, మహబూబ్‌నగర్, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.