Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మణికొండలో హైడ్రా బాహుబలి బుల్డోజర్లు భారీ భవంతులను కూల్చివేశాయి. నెక్నాంపూర్ చెరువును ఆక్రమించి భారీ భవంతులు నిర్మించారని స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఆయన భవనాలన్నీ అక్రమమని తేల్చి కూల్చివేత నిమిత్తం అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో శుక్రవారం రంగంలోకి దిగిన అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య భవనాల కూల్చివేతలు చేపట్టారు.
Advertisement