Indian Railways | భారత్​లో అందుబాటులోకి త్వరలో హైడ్రోజన్ ఇంజిన్‌ రైలు

Indian Railways | భారత్​లో అందుబాటులోకి త్వరలో హైడ్రోజన్ ఇంజిన్‌ రైలు
Indian Railways | భారత్​లో అందుబాటులోకి త్వరలో హైడ్రోజన్ ఇంజిన్‌ రైలు
Advertisement

అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Railways | భారతీయ రైల్వే త్వరలోనే తొలి హైడ్రోజన్ ఇంజిన్‌తో నడిచే రైలు సేవలను ప్రారంభించనుంది. మే 2025 నుంచి జింద్-సోనిపత్ మార్గంలో ఈ హైడ్రోజన్ రైలు ప్రయోగాత్మకంగా నడవనుందని సమాచారం.

సాధారణంగా, హైడ్రోజన్ ఇంజిన్‌ల శక్తి సామర్థ్యం 600-800 హార్స్‌పవర్ మధ్య ఉంటుంది. కానీ భారత్​ మాత్రం 1,200 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన రైలును హైడ్రోజన్ ఇంజిన్‌తో నడిపించబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక శక్తి సామర్థ్యంతో కూడిన హైడ్రోజన్ రైలును నడపడం ద్వారా భారతీయ రైల్వే సరి కొత్త రికార్డు సృష్టించబోతోంది.

ఈ హైడ్రోజన్ ఇంజిన్‌ రైలు గరిష్టంగా 110 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. మొత్తం 2,638 మంది ప్రయాణికులను ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం.

హైడ్రోజన్ ఇంజిన్‌ రైలు భారత్​కు ఒక ప్రధాన మైలురాయి కానుంది. ఎందుకంటే హైడ్రోజన్ ఇంధనం ఆధారంగా నడిచే ఈ రైలు పర్యావరణ హిత రవాణాకు మార్గం కానుంది. హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించే ఈ రైలు కార్బన్ ఉద్గారాలను పూర్తిగా తగ్గిస్తుంది. ఇది కేవలం నీరు, వేడి మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. తద్వారా వాయు కాలుష్యాన్ని నివారించగలదు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భారతీయ రైల్వే భవిష్యత్తులో మరిన్ని హైడ్రోజన్ ఆధారిత రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు.

Advertisement