అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతున్న వేళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి MLA Komatireddy Rajagopal Reddy ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్లో Assembly media point చిట్‌చాట్ చేశారు. కేబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో సీరియస్‌గానే చర్చ జరిగిందని పేర్కొన్నారు. కానీ, తనకు ఇప్పటి వరకైతే ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు. మంత్రి పదవి వస్తదనే భావిస్తున్నానని ఆయన తెలిపారు.
భువనగిరి ఎంపీ Bhuvanagiri MP ఎన్నిక బాధ్యతలు ఇస్తే.. సమర్ధవంతంగా నిర్వహించానని పేర్కొన్నారు. ఏ పదవి వచ్చినా సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలపక్షాన నిలబడతానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో state politics చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలతో త్వరలో కేబినెట్ విస్తరణ ఉండబోతుందనే చర్చ సాగుతోంది.