అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ మండలం చించోలి గ్రామంలో బుధవారం బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. బాల్య వివాహం వల్ల కలిగే అనర్ధాలను ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీడీపీవో సౌభాగ్య, సూపర్ వైజర్ సుమలత, మీనా, అంగన్ వాడీ టీచర్ పాల్గొన్నారు.