Skin Health Care : ఐస్ క్యూబ్స్‌తో ఇలా చేస్తే.. వేసవిలో కూడా మీ చర్మం మెరుస్తుంది..!

Skin Health Care : ఐస్ క్యూబ్స్‌తో ఇలా చేస్తే.. వేసవిలో కూడా మీ చర్మం మెరుస్తుంది..!
Skin Health Care : ఐస్ క్యూబ్స్‌తో ఇలా చేస్తే.. వేసవిలో కూడా మీ చర్మం మెరుస్తుంది..!

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Skin Health Care : ఎండాకాలం (Summer) వచ్చేసింది. ఎండలు మండుతున్నాయి. మాడు పగిలేలా ఎండలు (Summer) కొడుతున్నాయి. ఇంకా మార్చి నెల కూడా పూర్తి కాలేదు అప్పుడే (Summer) ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండల్లో తిరిగే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. చర్మం మొత్తం కమిలిపోయే ప్రమాదం ఉంటుంది. బయట తిరిగే వారి ముఖం మీద, చర్మం మీద ఎండ పడి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకే.. ఎక్కువ సేపు ఎండల్లో తిరిగే వారు ఇలా చేస్తే మీ ముఖం, చర్మం తాజాగా మెరుస్తుంది.

Advertisement
Advertisement

ఎండ వేడి నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఎక్కువ మంది (Ice cubes)ఐస్ క్యూబ్స్ తో చర్మం మీద మర్దన చేస్తుంటారు. కానీ, అలా చేస్తే ఏదో కొంత సేపు మాత్రమే ఉపశమనం కలుగుతుంది. అవే (Ice cubes)ఐస్ క్యూబ్స్ తో కొన్ని రకాల పదార్థాలను కలిపితే మీ చర్మం నిగనిగా మెరవడం ఖాయం. దాని కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ వంటింట్లో ఉన్న వస్తువులతోనే ఈ పని చేయొచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  Badam Milk : ఎండాకాలం కదా అనీ బాదంపాలు తెగ తాగుతున్నారా.. అయితే ,ఇది మీకోసం...?

Skin Health Care : పాలు, ముల్తానీ మట్టి ఉంటే చాలు

మీ ఇంట్లో పాలు ఉంటే, ఉదయమే పచ్చి పాలను తీసుకొని వాటిని ఐస్ ట్రేలో పోయండి. ఐస్ ట్రేలో నీళ్లు లేకుండా కేవలం పాలు మాత్రమే పోసి ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అవి క్యూబ్స్ గా మారిన తర్వాత బయటికి తీసి ఆ క్యూబ్స్ తో skin చర్మంపై రుద్దుకోండి. దాని వల్ల చర్మం మెరుస్తుంది. తాజాగా కనిపిస్తుంది. మృదువుగా మారుతుంది. ముఖం మీద కూడా మిల్క్ క్యూబ్స్ ను అప్లయి చేయొచ్చు. రాత్రి పడుకునే ముందు ఇలా మిల్క్ క్యూబ్స్ తో రుద్దుకుంటే, ఉదయం లేచేసరికి మీ ముఖం యవ్వనంగా మారుతుంది. అలాగే, ముల్తానీ మట్టి ఒక చెంచా తీసుకొని దాంట్లో నాలుగు చెంచాల రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పెట్టి అవి క్యూబ్స్ గా మారాక వాటిని చర్మంపై రుద్దుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

Advertisement