అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ICICI BANK RESULTS | దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ (ICICI Bank) ఫలితాల్లో దుమ్మురేపింది. నాలుగో త్రైమాసికం(Forth quarter)లో కంపెనీ నికర లాభాలు(Net profits) 18 శాతం పెరిగాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ శనివారం మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. 2023-24 నాలుగో త్రైమాసికంలో fourth quarter నికరలాభం రూ.10,708 కోట్లు కాగా.. 2024-25 నాలుగో త్రైమాసికంలో fourth quarter రూ.12,630 కోట్లకు పెరిగింది. 18 శాతం వృద్ధి నమోదయ్యింది.
సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం net interest income 11.8 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. అంతకుముందు ఏడాది రూ.19,093 కోట్లుగా ఉన్న ఆదాయం income ఈసారి రూ.21,193 కోట్లకు చేరిందని తెలిపింది. వడ్డీయేతర ఆదాయం Non-interest income 18.4 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లుగా నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ మొండిబకాయిలు దాదాపు 24 శాతం పెరిగి రూ.891 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంకులు సాధారణంగా రాబోయే త్రైమాసికంలో మొండిబకాయిల bad loans పెరుగుదల లేదా తగ్గుదల అంచనాల ప్రకారం కేటాయింపులను పెంచుతాయి లేదా తగ్గిస్తాయి.
ICICI BANK RESULTS | తగ్గిన ఎన్‌పీఏ
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చినప్పుడు ఈ త్రైమాసికంలో బ్యాంక్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్(Non-performing assets) 49 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఎన్‌పీఏ 1.96 శాతం నుంచి 1.67 శాతానికి తగ్గింది.
డివిడెండ్ : ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ (Dividend) ప్రకటించింది. డివిడెండ్ ఇష్యూ ఆమోదం పొందిన తర్వాత రికార్డు డేట్‌ను ప్రకటించనున్నారు.
ICICI BANK RESULTS | ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర
ఐసీఐసీఐ బ్యాంక్ షేరు ధర(Stock price) చివరి ట్రేడింగ్ సెషన్(గురువారం)లో 3.7 శాతం పెరిగి రూ. 1,407 వద్ద ముగిసింది. 52 వారాల గరిష్ట ధర రూ. 1,409 కాగా.. కనిష్ట ధర రూ. 1,051. ఈ బ్యాంక్ ఇన్వెస్టర్లకు ఐదేళ్లలో 31 శాతం రిటర్న్స్(Returns) అందించగా.. ఏడాది కాలంలో 32 శాతం రాబడిని ఇచ్చింది.