అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kidney Disorders | ఆరోగ్యాన్ని health కాపాడుకోవడంలో మూత్రపిండాలు kidneys ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రక్తం నుంచి వ్యర్థాలను ఫిల్టర్ filter of blood wastage చేయడానికి, శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడానికి కిడ్నీలు కీలకంగా వ్యవహరిస్తాయి. అలాగే, సోడియం, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను శారీరక అవసరాలకు అనుగుణంగా నియంత్రిస్తాయి.
అంతటి ప్రాధాన్యమున్న కిడ్నీ సమస్యలతో kidney problems బాధ పడుతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిపోయింది. మూత్రపిండాలు సరిగా పనిచేయక రడయాలసిస్ చేసుకుంటున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతున్నది. కాస్త అప్రమత్తంగా ఉంటే ముందుగానే కిడ్నీ రుగ్మతలను kidney disorders గుర్తించి తగిన చికిత్స proper treatment తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
Kidney Disorders | ప్లాస్టిక్‌తోనే ముప్పు..
నిత్య జీవనంలో మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ వల్లే మూత్రపిండాల పనితీరును దెబ్బ తీస్తున్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. ప్లాస్టిక్‌లలో ఉన్న టాక్సిన్‌లు toxins కిడ్నీలపై ప్రభావం affect the kidneys చూపుతున్నాయని తేల్చారు. చిన్న చిన్న లక్షణాలతో కిడ్నీ రుగ్మతలు గుర్తించవచ్చని వైద్యలు Doctors చెబుతున్నారు. ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ఇబ్బందులు లేకుండా జీవించవచ్చని పేర్కొంటున్నారు.
Kidney Disorders | ప్రారంభ లక్షణాలు
- అలసట, బలహీనత: మూత్రపిండాల పనితీరు దెబ్బ తింటున్న తరుణంలో శరీరంలో విషాల సేకరణకు దారితీస్తుంది, ఇది నిరంతర అలసట, బలహీనతకు దారితీస్తుంది. మూత్రపిండాల వ్యాధులు Kidney diseases రక్తహీనతకు కారణమవుతాయి. ఇది అలసట భావాలకు మరింత దోహదం చేస్తుంది.
- మూత్ర విసర్జనలో మార్పులు: రాత్రి సమయంలో తరచూ మూత్ర విసర్జన urination రావడం, ముదురు గోధుమ రంగులో మూత్రం రావడం.
- పాదాల వాపులు: మూత్రపిండాలు సరిగా పని చేయకపోతే ఒంట్లో సోడియం నిల్వలు sodium stores పెరుగుతాయి. దీని ద్వారా పాదాలు, చీలమండలు, కాళ్లు, చేతులకు వాపులు వస్తాయి.
- చర్మం దురద: మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. దీంతో కాళ్లు, చేతులు, వీపుపై legs, arms, and back తీవ్రమైన దురద వస్తుంది.
- కళ్ళ చుట్టూ ఉబ్బరం: మూత్రపిండాల ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు మూత్రంలో ప్రోటీన్ ఉండటం వల్ల కళ్ల చుట్టూ ఉబ్బరం ఏర్పడుతుంది.
- ఆకలి లేకపోవడం: మూత్రపిండాల వ్యాధి వికారం, వాంతికి దారితీస్తుంది, ఇది ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి కూడా దారితీస్తుంది.
- కండరాల తిమ్మిరి: సోడియం, కాల్షియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లలో అసమతుల్యత కండరాలు నరాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా తిమ్మిర్లు వస్తాయి.
ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా తగిన చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంగా completely healthy ఉండవచ్చని పేర్కొంటున్నారు.