China | అమెరికా తరిమిస్తే, చైనా రమ్మంటోంది.. 100 రోజుల్లో 85వేల మందికి వీసాలు

China | అమెరికా తరిమిస్తే, చైనా రమ్మంటోంది.. 100 రోజుల్లో 85వేల మందికి వీసాలు
China | అమెరికా తరిమిస్తే, చైనా రమ్మంటోంది.. 100 రోజుల్లో 85వేల మందికి వీసాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: China | అమెరికా United States అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌ కఠిన నిర్ణయాలు tough decisions తీసుకుంటున్నారు. భారీగా సుంకాలు విధించిన ప్రంపచ దేశాల మార్కెట్లను శాసించిన ఆయన తమ దేశంలో అక్రమంగా వలస illegal immigrants ఉంటున్న వారిపై కొరడా ఝలిపించారు. ఈ నేపథ్యంలో అమెరికా చిరకాల ప్రత్యర్థి చైనా China తీసుకుంటున్న నిర్ణయాలు సైతం చర్చకు దారితీస్తున్నాయి.

Advertisement

డోనాల్డ్‌ ట్రంప్‌ Donald Trump తొలుత సుంకాలు విధించి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. కానీ, చైనా దీటుగా ప్రతిసుంకాలు tariffs విధించడంతో మండిపడ్డ ఆయన చైనాకు China మినహాయించి అన్ని దేశాలపై విధించిన సుంకాలను tariffs వెనక్కి తీసుకున్నారు. ఇదే సమయంలో అక్రమంగా వలస ఉంటున్న విదేశీయులకు సంకెళ్లు వేసి వారివారి దేశాలకు పంపించారు. దీనికితోడు ఉచితంగా ఆయా దేశాలకు పంపేలా ఏర్పాట్లు arrangements చేస్తామని తాజాగా ప్రకటించారు. ఒకవిధంగా అమెరికాలో పెద్దమొత్తంలో ఉన్న భారత విద్యార్థులు, ఉద్యోగార్థులపై Indian students and job seekers ఈ నిర్ణయం decision తీవ్ర ప్రభావం చూపింది.

ఇది కూడా చ‌ద‌వండి :  China | అమెరికాకు షాక్​ ఇచ్చిన చైనా..​

China | చైనా ప్రత్యేక ఆఫర్‌

అమెరికా America తీరు ఇలా ఉంటే.. చైనా అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తమ దేశానికి రావాలనుకునే భారత విద్యార్థులు, ఉద్యోగార్థులకు Indian students and job seekers మంచి ఆఫర్‌ good offer ప్రకటించింది. వీసా ప్రక్రియను visa process సులభతరం చేసింది. కాగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 85వేల మంది భారతీయులకు Indians వీసా జారీ చేసినట్లు issued visas ఇండియాలోని చైనా ఎంబసీ Chinese Embassy ప్రకటించింది.

China | వీసా జారీలో సడలింపులు

ప్రత్యేకించి ఎలాంటి ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ online appointment లేకుండానే నేరుగా వీసా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే బయోమెట్రిక్‌ ఆప్షన్‌ biometric option మినహాయించి సమయాన్ని కూడా కుదించారు. వీసా రేట్లను Visa rates సైతం గణనీయంగా తగ్గించారు. ఈ క్రమంలోనే అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనాను ఎంచుకుంటున్న పలువురు విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఆ దేశం బాట పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement