Posani | రెండు రోజుల్లో బెయిలు రాకుంటే ఆత్మహత్యే శరణ్యం : పోసాని

Posani | పోసానికి మళ్లీ షాక్​.. విడుదలకు బ్రేక్​
Posani | పోసానికి మళ్లీ షాక్​.. విడుదలకు బ్రేక్​
Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Posani : రెండు రోజుల్లో బెయిలు రాకుంటే ఆత్మహత్య శరణ్యమని పోసాని కృష్ణ మురళి వాపోయారు. గుంటూరులో జడ్జి ఎదుట పోసాని కన్నీరు పెట్టుకున్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా, పోసానికి ఈ నెల 26 వరకు కోర్టు రిమాండు విధించింది.

వివిధ కేసుల్లో అరెస్టయిన పోసానిని పోలీసులు బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జడ్జి ఎదుట పోసాని బోరున విలపించాడు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రెండు ఆపరేషన్లు అయ్యాయని, స్టంట్లు కూడా వేశారని జడ్జికి విన్నవించారు. తాను తప్పు చేస్తే నరికేయాలని.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థతి బాగా లేదని వివరించారు. తనకు బెయిలు మంజూరు చేయాలని జడ్జిని పోసాని కోరారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Medical camp | ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

కాగా.. పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అలాగే వివిధ స్టేషన్లలో ఫిర్యాదులు పెండింగులో ఉన్నాయి. ఇప్పటికే ఆయన జైలులో రిమాండ్ పై ఉన్నారు.

Advertisement