అక్షరటుడే, వెబ్డెస్క్: Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోని కొందరు నేతలపై విరుచుకుపడ్డారు. “బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాన్ బయటకు పంపాలని” వ్యాఖ్యానించారు. బీజేపీ అధిష్టానం ఈ దిశగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో హిందువులు సురక్షితంగా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.
Raja Singh | రేవంత్రెడ్డి తొమ్మిదో నిజాం
సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) తొమ్మిదో నిజాంలా(Nizam) ప్రవర్తిస్తున్నారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు. హిందువులు హోలీ(Holi Festival) పండుగ ఎలా జరుపుకోవాలో ప్రజలకు చెబుతారా అంటూ మండిపడ్డారు. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు అంటూ ప్రశ్నించారు. రంజాన్(Ramadan Month) నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరన్నారు. కాంగ్రెస్ అంటేనే హిందువుల వ్యతిరేక పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల జోలికి వస్తే రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.