అక్షరటుడే, వెబ్ డెస్క్ Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రైతుల (Farmers) సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. (Farmers) రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు బంధు Raithu Bandu పథకాన్ని కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతుభరోసాగా పేరు మార్చి ఎకరానికి అదనంగా రూ.1000 పెంచింది. రెండు విడతలుగా ఒక ఏడాదిలో ఎకరాకు రూ.12,000 జమచేయనున్నారు. కాగా ఇప్పటికే (Rythu Bharosa) రైతుభరోసా డబ్బులను అర్హులైన రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమచేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు 3 ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసిన ప్రభుత్వం తాజాగా 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది.
Rythu Bharosa : టెన్షన్ వద్దు..
3 నుంచి 4 ఎకరాల మధ్య భూమి ఉన్న (Farmers) రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు రూ.200 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4666 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఈ నెలాఖరులోపు అర్హులైన ప్రతీ ఒక్క (Farmers) రైతుల ఖాతాల్లో నిధులను మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని సాంకేతిక కారణాలతో పాటు అకౌంట్ నంబర్లు తప్పు ఇవ్వడం లాంటి వాటివల్ల ఎకరం వరకు భూమి ఉన్న కొంతమందికి ఇప్పటివరకు నిధులు జమకాలేదు. కాగా ఇటీవల అగ్రికల్చర్ అధికారులు ఆయా రైతుల నుంచి సరైన వివరాలను సేకరించారు. మార్చి 25వ తేదీన వారి ఖాతాల్లో కూడా డబ్బును క్రెడిట్ Creditచేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పుకొచ్చింది. కొత్తగా పాస్‌బుక్ పొందిన (Farmers) రైతులకు ఈ పథకం ద్వారా ఇంకా నిధులు అందలేదనీ, వారు తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలని అధికారులు సూచించారు. బ్యాంకుకి Bank వెళ్లి, ఉద్యోగులను అడిగితే, వారు పూర్తి వివరాలు చెబుతారు. ఒకవేళ అకౌంట్‌కి పాస్‌బుక్ వివరాలు లింక్ చెయ్యకపోయి ఉంటే, వెంటనే చేయించుకోవాలి. తద్వారా డబ్బును ఉద్యోగులు.. అకౌంట్లలో జమ చేస్తారు. మూడు ఎకరాల లోపు భూమి ఉన్న కొందరు (Farmers) రైతుల నుంచి నిధులు జమ కాలేదని వస్తున్న కంప్లైంట్లను వేగంగా పరిష్కరించే ప్లాన్ చేస్తున్నట్టు కూడా అధికారులు తెలియజేశారు.