Odela Movie Review | మిల్కీ బ్యూటీ తమన్నా milky beauty tamanna bhatiya భాటియా ప్రధాన పాత్రలో హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘ఓదెల 2’ odela 2. సూపర్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా thriller movie తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా గతంలో ఎన్నడూ చేయని పాత్రలో జీవించారు. 2022లో ప్రేక్షకులను వణికించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి ఇది సీక్వెల్. దుష్ట శక్తుల బారినుంచి ఓదెల మల్లన్న స్వామి తమ గ్రామాన్ని ఎలా కాపాడతారనే ఇతివృత్తంతో ఓదెల-2 రూపొందించారు.
స్టార్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్ చేశారు. డైరెక్షన్ సూపర్ విజన్‌ని అందించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ సహా ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రయోగ్రాజ్లోని prayagraj మహా కుంభమేళా mahakumbh mela సాక్షిగా రిలీజ్ చేసిన టీజర్ నేషనల్ వైడ్‌గా ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇలా మొత్తానికి భారీ అంచనాల నడుమ ఓదెల 2 odela 2 reviw నేడు థియేటర్స్ లో విడుదలైంది.
Odela Movie Review | కథ ఏంటంటే..
మొదటి భాగంలో చనిపోయిన తిరుపతి(వశిష్ఠ) ఆత్మ క్షోభకు గురవ్వాలని ఓదెల గ్రామ ప్రజలు అతడికి సమాధి శిక్ష అమలు చేస్తారు. ఇలా చేస్తే, తిరుపతి సమాధిలో బాధ అనుభవిస్తాడని అనుకుంటారు. కానీ, కొన్ని అనూహ్య పరిణామాల నడుమ అతడి ఆత్మ సమాధి నుంచి బయటకి వస్తుంది. బయటకి రావడంతోనే ఆ ఊరిలో భయానక పరిస్థితులు సృష్టిస్తుంది. ఊరిలోని జనాన్ని ఆవహించి కొత్తగా పెళ్లి అయిన అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తుంటుంది తిరుపతి ఆత్మ.
తిరుపతి ఆత్మ భయానక చర్యలతో గ్రామ ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. మరోదారి లేక హెబ్బా పటేల్ చెప్పిన ప్రకారం ఊళ్లో వాళ్లు పరిష్కారం కోసం భైరవి(తమన్నా)ని ఆశ్రయిస్తారు. అందుకు సమ్మతించిన భైరవి ఓదెల గ్రామానికి వస్తుంది. కానీ, భైరవి భావించినంత సులువుగా సమస్య పరిష్కారం కాదు. మరి ఏం జరిగిందనేది తెరపై చూడాల్సిందే.
Odela Movie Review | ఎలా ఉందంటే..
కథ పరంగా.. ఇది ఒక సోషియో ఫాంటసీ మైథాలజికల్ చిత్రం. ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాలను గుర్తుచేస్తుంది. దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్ని ప్రేతాత్మకి, పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే భీకర యుద్ధంగా రూపొందించారు. మొదటి సగ భాగం అంతా తిరుపతి ఆత్మ బయటకు రావడం, పగ ప్రతీకారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, వారు ఊరిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేయడం వంటి సన్నివేశాలతో సాగిపోతుంది. ఆయా సన్నివేశాలు ఉత్కంఠగానే ఉంటాయి.
గ్రామంలోకి నాగసాధువు భైరవి ఎంట్రీతో రెండో భాగం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. తిరుపతి ఆత్మకు, భైరవికి మధ్య జరిగే పోరు.. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇస్తుందనే చెప్పాలి. మల్లన్న భక్తి ఎలిమెంట్ బాగానే వర్క్ అవుట్ అయింది. ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ క్లైమాక్స్ మరింత హై ఇస్తుంది.
Odela Movie Review | ఎవరెలా చేశారంటే..
పాత్రల విషయానికి వస్తే ఈ చిత్రం ఎక్కువగా తమన్నా పాత్ర చుట్టూ తిరుగుతుంది. తను సింగిల్ హ్యాండ్ భారాన్ని మోసినట్లు చూడొచ్చు. మిల్కీ బ్యూటీగా గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన తమన్నాకు, ఇందులోని నాగసాధువు పాత్రలోని ఆమెకు అసలు పోలికే ఉండదు. అంత బాగా వైవిధ్య భరిత పాత్రలో తమన్నా ఇమిడిపోయింది. అంటే ఒక విధంగా మిల్కీ బ్యూటీ పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పొచ్చు.
చిత్రంలో వశిష్ట సింహ.. తమన్నాకి సరిసమానంగా కీలకమైన రోల్ పోషించారు. ‘కేజీఎఫ్’ సినిమాలో kgf movie నెగటివ్ పాత్రలో మెప్పించిన ఆయన, ఇందులో అంతకుమించి అనేలా చేశారు. పగతో రగిలిపోయే తిరుపతి ఆత్మ పాత్రలో వశిష్ట తన నటనతో అదరగొట్టారు. హెబ్బా పటేల్ hebba patel పాత్రలోనే నటించింది.
నటీనటులు: తమన్నా భాటియా, వశిష్ట సింహ, హెబ్బా పటేల్, యువ, నాగ మహేష్, వంశీ, సురేందర్ రెడ్డి, గగన్ విహారి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు
దర్శకత్వం: అశోక్ తేజ ashok teja
ఎడిటింగ్: తమ్మిరాజు thammiraju
నిర్మాణం: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ Sampath nandi
సంగీతం: బి.అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్
నిర్మాత: డి.మధు, సంపత్ నంది