whatsapp group Admin | మీరు వాట్సాప్​ గ్రూప్​ అడ్మినా.. అయితే జాగ్రత్త

whatsapp group Admin | మీరు వాట్సాప్​ గ్రూప్​ అడ్మినా.. అయితే జాగ్రత్త
whatsapp group Admin | మీరు వాట్సాప్​ గ్రూప్​ అడ్మినా.. అయితే జాగ్రత్త

అక్షరటుడే, వెబ్​డెస్క్: whatsapp group Admin | ప్రస్తుతం ఇంట్లో కంటే నెట్టింట్లోనే ప్రజలు ఎక్కువ సేపు గడుపుతున్నారు. సోషల్​ మీడియా(Social Medai)తో కాలక్షేపం చేస్తూ రోజులు వెళ్లదీస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. వాట్సాప్​, టెలిగ్రాం​ లాంటి సోషల్​ మీడియా వేదికల్లో గ్రూప్​లు పెట్టి మిత్రులతో చాటింగ్​లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్​ మీడియా గ్రూప్​ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఇలా వేటికవే వాట్సాప్​ గ్రూప్​లు పెడుతున్నారు. అందులో చాలా మంది మెసేజ్​లు ఫార్వర్డ్ చేస్తుంటారు. అయితే ఆ మెసేజ్​లతో ఏదైనా సమస్య వస్తే సందేశం పంపిన వారితో పాటు గ్రూప్​ అడ్మిన్​లు కూడా ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.

Advertisement
Advertisement

whatsapp group Admin | ఇటీవల కేసు నమోదు

చాలా మంది ఉత్సాహంతో వాట్సాప్​(Whatspp) గ్రూప్​లు క్రియేట్​ చేస్తారు. అంతేగాకుండా మరికొందరికి అడ్మిన్​గా అవకాశం ఇస్తారు. అయితే అందులో వచ్చే మెసేజ్​లు, ఫొటోల గురించి అంతగా పట్టించుకోరు. ఇటీవల కామారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి ప్రశ్నలు బయటకు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి ఫొటో పలు వాట్సాప్​ గ్రూపుల్లో ఫార్వర్డ్​ అయింది. దీంతో పోలీసులు ప్రశ్నలను బయట పెట్టిన వారితో పాటు వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్​పై కూడా కేసు నమోదు చేశారు. ఇలా గతంలోనూ పలువురు అడ్మిన్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Chris Gayle : బీచ్‌లో ల్యాప్‌టాప్‌తో క్రిస్ గేల్ ర‌చ్చ‌.. నెటిజ‌న్స్ క్రేజీ రియాక్ష‌న్స్

whatsapp group Admin | సీఎం సీరియస్​

ఇటీవల సోషల్​ మీడియాలో నకిలీ వార్తలు, ఫేక్​ ఫొటోలు హల్​చల్​ చేస్తున్నాయి. ఈ విషయంపై సీఎం రేవంత్​రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ, ఏఐ జనరేటేడ్​ ఫొటోలు, వీడియోల వ్యాప్తి అరికట్టడానికి సైబర్​ క్రైం విభాగాన్ని బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. దీంతో నకిలీ వార్తలు, ఫేక్​ ఫొటోలు వచ్చిన గ్రూపులకు అడ్మిన్​గా ఉన్న వారిపై సైతం కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

whatsapp group Admin | ఇలా చేయాలి..

వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్​లు నకిలీ వార్తలను ఫార్వర్డ్​ చేయకుండా చూడాలి. అలాంటి పోస్టులు కనిపిస్తే వెంటనే డిలీట్​ చేయాలి. అంతేగాకుండా పంపిన వారిని హెచ్చరించాలి. ఫేక్​ ఫొటోలు, వీడియోలు పంపే వారిని గ్రూపుల నుంచి తీసివేయాలి.

Advertisement