
అక్షరటుడే, వెబ్ డెస్క్ Sri Rama Navami : 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 6 వ తేదీన చైత్రమాసం శుక్లపక్షము నవమి తిథి రోజున శ్రీరామనవమి పండుగ. ఈ పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. రామయ్య పుట్టినరోజున భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే, ఏడాది శ్రీరామనవమి రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. నేపథ్యంలో పరిహారాలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
శ్రీరామనవమి రోజు పండుగ హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పురాణ గ్రంథాల్లో నవమి రోజున లోక రక్షకుడు శ్రీరమహావిష్ణువు దశావతారం రాజుకు శ్రీరాముడిగా జన్మించాడని చెప్పబడింది.
శ్రీరాముని ఆరాధన : శ్రీరామనవమి రోజున శ్రీరామునికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శ్రీరామనవమి రోజున రాముని పూజించే వారిపై ప్రత్యేక ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున రామున్ని పూజిస్తే ప్రతి పనిలో విజయం అందుకుంటారు. శ్రీరాముని జన్మదినం సందర్భంగా ప్రజలందరూ సీతారాముల కళ్యాణం కూడా జరుపుకుంటారు. ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకుంటే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.
రామనవమి రోజున ఈ శుభ యోగాలు ఏర్పడుతున్నాయి : ఈసారి శ్రీరామనవమి ఆదివారము వచ్చింది. ఈరోజు పుష్యమి నక్షత్రం. ఈరోజున వీటి కలయిక ఏర్పడుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఆదివారం రోజున రవి పుష్య యోగం ఏర్పడుతుంది. సర్వార్ధ సిద్యోగం కూడా ఏర్పడుతుంది. సులక్ష్మీ యోగం, మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగాలు కూడా శ్రీరామనవమి రోజున ఏర్పడుతున్నాయి.
కాబట్టి ఈరోజు ఉదయం స్నానం ఆచరించిన తర్వాత బాలకాండ చదవాలి. ఇలా చేయడం వల్ల రాముడు అన్ని కోరికలను నెరవేరుస్తాడు. 108 తులసి ఆకులపై శ్రీరామ నామం రాసి, తులసి దళాలను మాల కట్టి శ్రీరామునికి సమర్పించాలి. రామ మందిరానికి 1.25 కిలోల పెసరపప్పు బెల్లం విరాళంగా అందించండి. ఇలా చేస్తే కుటుంబం ఎప్పుడు ఆనందంతో, రాముని అంత కీర్తి ప్రతిష్టలతో, మీ కుటుంబంపై శ్రీరాముని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది.