
అక్షరటుడే, వెబ్ డెస్క్ Sri Rama Navami : 2025వ సంవత్సరములో చైత్రమాసంలో శుక్లపక్షం నవమి తిథి హిందూ మతంలో ప్రత్యేకంగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు శ్రీరామ నవమి. ఈ శ్రీరాముని కళ్యాణం రోజున హిందూ మత విశ్వాసం ప్రకారం పెళ్లి కాని యువతీ యువకులు కొన్ని చర్యలు తీసుకుంటే వివాహంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ అవన్నీ తొలగిపోయి కోరుకున్న జీవిత భాగస్వామిని పొందవచ్చని నమ్ముతారు.
ఈ రోజున దేవాలయాలలో రామచరిత మానస్ ను. పటించడం వల్ల జీవితంలోని వివిధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు, శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
శ్రీరామనవమి రోజున పూజకు సుభ సమయాలు ఉదయం 11:08 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు ఉంటుంది. ఈరోజున భక్తులకు రామయ్య పూజ కోసం మొత్తం 2 గంటల 31 నిమిషాల సమయం లభిస్తుంది.
వివాహ ప్రయత్నాలు చేసే సమయంలో పదేపదే అడ్డంకులు ఏర్పడుతుంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సీతారాములకు పసుపు గంధం కుంకుమను సమర్పించండి. ఇలా చేస్తే వివాహంలో ఎవరికైనా అడ్డంకులు ఏర్పడితే అవి తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు కోరుకున్న జీవిత భాగస్వామిని కూడా పొందవచ్చు.
శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని చూసినట్లయితే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద 11 దీపాలు వెలిగించండి. మీకు అంటూ వ్యాధులైన, ఎటువంటి వ్యాధులు ఉన్నా కానీ వాటి నుంచి మీరు బయట పడాలంటే హనుమంతుడిని పూజించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక, తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
సంతానం కోసం ఎదురుచూసే దంపతులు శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి.. దానిలో కొబ్బరికాయను చుట్టి సీతాదేవి పాదాలకు సమర్పించండి. ఆ తరువాత ఓం నమశ్శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా దంపతులకు త్వరలో పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉందని నమ్ముతారు.