TTD | శ్రీవారికి రూ. కోటి విరాళమిస్తే.. జీవితకాలం ప్రత్యేక దర్శన భాగ్యం

TTD | శ్రీవారికి రూ. కోటి చెల్లిస్తే.. కోటి వరాలు
TTD | శ్రీవారికి రూ. కోటి చెల్లిస్తే.. కోటి వరాలు

అక్షరటుడే, తిరుమల: TTD : కలియుగ దైవం తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమల(Tirumala)లో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగతా రోజులలో విరాళం ఇచ్చిన భక్తులు తమకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
  • రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది పలు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది.
  • సంవ‌త్స‌రంలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు.
  • 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, దుప్పట – 1, రవికే – 1, మహా ప్రసాదం ప్యాకెట్లు – 10, ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలు పొందవచ్చు.
  • రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం కూడా 3 రోజులు కల్పిస్తారు.
  • జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయం వారికి చూపించి పొందవచ్చు.

దాతలు టీటీడీ ట్రస్ట్ లకు విరాళాలు ఇవ్వవచ్చు. కాటేజ్ డొనేషన్ స్కీం(Cottage Donation Scheme), ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్(SV Pranadana Trust), ఎస్వీ విద్యాదాన ట్రస్ట్(SV Vidyadana Trust), బర్డ్ ట్ర‌స్టు(Bird Trust), శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్ట్(Sri Venkateswara Annadana Trust), శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్(Sri Venkateswara Go Sarkashram Trust), శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్ట్(Sri Venkateswara Sarva Shreyas Trust), శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్(Sri Venkateswara Veda Parirakshan Trust), శ్రీవాణి ట్రస్ట్(Sri Vani Trust), శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్ట్(Sri Venkateswara Bhakti Channel Trust), శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీమ్ (స్విమ్స్)(Sri Balaji Arogya Varaprasadini Scheme (SWIMS)) లకు దాతలు విరాళాలు చెల్లించి సంబంధింత సౌకర్యాలను పొందవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి :  TTD | టీటీడీ సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక పోర్టల్

టీటీడీ వెబ్ సైట్ అయిన www.ttddevasthanams.ap.gov.in లో కూడా విరాళాలు చెల్లించవచ్చు. ఆఫ్ లైన్ లో అయితే దాతలు ఈవో, టీటీడీ పేరిట డీడీ(DD) / చెక్(cheque) తీసుకుని తిరుమలలోని దాతల విభాగంలో ( డోనార్ సెల్) అందజేయాలి.

Advertisement