వీటిని మీ ఇంట్లో ఇలా చూడడం ప్రారంభిస్తే… మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే… దురదృష్టానికి సంకేతం..?

వీటిని మీ ఇంట్లో ఇలా చూడడం ప్రారంభిస్తే... మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే... దురదృష్టానికి సంకేతం..?
వీటిని మీ ఇంట్లో ఇలా చూడడం ప్రారంభిస్తే... మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే... దురదృష్టానికి సంకేతం..?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌

Advertisement
Bad Time : ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎన్నో కష్టాలని, సుఖాలని అనుభవిస్తూ వస్తూ ఉంటారు. ఎవరికైనా మంచి జరిగినా, చెడు జరిగిన మొదట కొన్ని సంకేతాలు మనకి కనిపిస్తాయి. అయితే, జ్యోతిష్య శాస్త్రంలో మన ఇంట్లో కొన్ని సంకేతాలు ఈ విధంగా చూస్తే మనకి జీవితంలో చెడుకాలం ప్రారంభమైనట్లు… ఈ విధంగా మన ఇంట్లో కనిపించే సంకేతాలు దురదృష్టాలకు సంకేతాలు, మనకి రాబోయే కాలంలో చెడు కాలం స్టార్ట్ అయినట్లే అని అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని మంచి, చెడు సమయాలు ఉంటాయి. మంచి జరిగితే ఉన్నత శిఖరాలకి ఎదుగుతాము, చెడు జరిగితే రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

మంచి కాలం అయినా, చెడు కాలం అయినా ఒక మనిషి జీవితంలో ఎక్కువకాలం ఉండదు. మంచి జీవితాలలో సుఖాలని అనుభవింపజేస్తే, చెడు సమయాలు వ్యక్తికి కొన్ని గుణపాటాలని నేర్పిస్తుంది అని నమ్ముతారు. రాబోయే కాలంలో చెడు జరుగుతుంది అని చెప్పుటకు కొన్ని సంకేతాలు మన ఇంట్లో కనిపిస్తాయి. మీ ఇంట్లో ఇలా కనిపిస్తే చెడు కాలం ప్రారంభం కానున్నది అని అర్థం చేసుకోవాలి. వచ్చాడు సంకేతాలు కనిపించినప్పుడు చెడు కాలం ప్రారంభం అవుతుంది అని, సంకేతాలు ఇలా ఉంటాయి అని, వీటికి సంకేతాలు గురించి పండితులు తెలియజేస్తున్నారు…

ఇంట్లో ఎలుకలు పెరిగితే : మీ ఇంట్లో నల్ల ఎలుకలు తిరగడం ప్రారంభించిన, ఆ ఇంట్లో ఆ వ్యక్తులకు చెడు కాలం అయినట్లే. ఇంటికి ఎక్కువ ఎలుకలో రావడం మొదలుపెడితే, భవిష్యత్తులో ఆ ఇంటిలో ఏదో విపత్తు జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి.

ఎండిన తులసి మొక్క : మన ఇంట్లో తులసి మొక్క పవిత్రంగా పూజ చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. అటువంటి తులసి మొక్క ఇంట్లో హఠాత్తుగా ఎండిపోతే, మనకి చెడు కాలం ప్రారంభం అవుతున్నట్లు అర్థం. మొక్క ఏ ఇంట్లో అయితే ఎండిపోయినట్లు సంకేతంగా చూపిస్తున్న ఆ ఇంట్లో రాబోయే కాలంలో ఆర్థికంగా సంక్షోభాన్ని ముందస్తుగా సూచిస్తున్నట్లు అర్థం.

బంగారం పోగొట్టుకుంటే : మనము జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బంగారు వస్తువులను పోగొట్టుకున్నటైతే అది అశుభంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని విశ్వాసాలు ప్రకారము ఏదైనా బంగారు వస్తువులు పోగొట్టుకున్నట్లయితే, ఆ వ్యక్తి ఆ ఇంటిలో ప్రతికూలత రావడం ప్రారంభమవుతుంది. బంగారం సంతోషానికి, సుఖాలకు చిహ్నంగా భావిస్తారు కాబట్టి.

రెండు బల్లులు కొట్లాడుకుంటే : శాస్త్రంలో రెండు బల్లులు మీ ఇంట్లో కొట్టుకున్నట్లు కనపడినట్లయితే, మీరు అది అశుభంగా భావించవచ్చు. మీకు త్వరలోనే చెడు కాలం ప్రారంభమవుతుంది అని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో తెలుపబడింది.

నెయ్యి పాత్ర కింద పడిపొతే : చేతిలో ఉన్న నెయ్యి పాత్ర స్టడంగా చేయి జారి కింద పడిపోతే, అదికూడా చెడుకాలానికి సంకేతం. ఆ పాత్ర ఎవరి చేతి నుంచి అయినా నెయ్యి ఉన్న పాత్ర కింద పడితే గనక, లేక అది అక్కడ నేల అంతా చిందితే, రాబోయే చెడు కాలాలకు సంకేతంగా భావించాలి.

పూజ ప్లేట్ కింద పడినట్లయితే : మీ ఇంట్లో దేవుని పూజ గదిలో పూజ చేసే సమయంలో కోసం ఉపయోగించే ప్లేటు ఆకస్మాత్తుగా చేయి జారి పడిపోయినట్లయితే. ఇది రానున్న చెడు కాలానికి సంకేతంగా భావించవచ్చు. వెంటనే దేవుని గుడిలోకి వెళ్లి క్షమాపణ అడిగి నమస్కరించాలి. జ్యోతిష్య శాస్త్రంలో పూజ పాత్ర పడిపోతే ఈ విధంగా చేయాలని నిపుణులు తెలియజేస్తున్నారు.