Harsh Goenka | ధనవంతులు కావాలా.. అయితే ఇలా చేయండి

Harsh Goenka | ధనవంతులు కావాలా.. అయితే ఇలా చేయండి
Harsh Goenka | ధనవంతులు కావాలా.. అయితే ఇలా చేయండి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harsh Goenka | ప్రముఖ బిజినెస్​మ్యాన్​, ఆర్పీజీ ఎంటర్​ప్రైజెస్​ ఛైర్మన్​ హర్ష గోయెంకా(Harsh Goenka) నిత్యం సోషల్​ మీడియా(Social Media)లో యాక్టివ్​గా ఉంటారు. యువతకు కీలక సూచనలు చేస్తూ ఉంటారు. తన ఎక్స్(X)​ ఖాతాల్లో ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై స్పందిస్తారు. ప్రజలు ధనవంతులు కావాలంటే పాటించాల్సిన కొన్ని సుత్రాలను తాజాగా ఆయన చెప్పారు. ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదని, ఎంత ఖర్చు చేస్తున్నాం.. ఎంత పొదుపు చేస్తున్నాం అనే విషయాలు ముఖ్యమని ఆయన అన్నారు.

Advertisement

Harsh Goenka | ఆయన చెప్పిన టిప్స్​..

  • ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను పెంచుకోవాలి.
  • సంపాదించే కంటే తక్కువ ఖర్చు చేయాలి.
  • ఆదాయాన్ని మాత్రమే కాదు.. సంపదను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.
  • ఆర్థిక విషయాల్లో అవగాహన పెంచుకోవాలి.
  • డబ్బు సంపాదించే మార్గాల కోసం అన్వేషించాలి
  • కేవలం డబ్బు కోసమే కాకుండా.. నేర్చుకోవడం కోసం పని చేయాలి.

Harsh Goenka | పొదుపు మరిచి..

ప్రస్తుత యువత పొదుపు మరిచి ఖర్చు చేస్తున్నారు. గతంలో మన పూర్వీకులు పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు లేని డబ్బును ముందే ఖర్చు చేస్తున్నారు. క్రెడిట్​ కార్డులు(Credit cards), ఈఎంఐ(EMI)ల పుణ్యమా అని అనవసర వస్తువులు కొనుగోలు చేసేవారు పెరిగిపోయారు. దీంతో ఆర్థిక క్రమశిక్షణ లోపించి అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఈ క్రమంలో హర్ష గోయెంకా ట్వీట్​ వైరల్​ అవుతోంది.