అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం ఇవాళ సాయంత్రం వైభవంగా ప్రారంభమైంది. భారీగా భక్తులు తరలిరావడంతో విజయనగరం రద్దీగా మారింది. అమ్మవారి ప్రతిరూపంగా పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించారు. అంజలి రథం, తెల్లటి ఏనుగు రథం, పాలధార, జాలరి వల ముందు నడవగా ప్రధాన ఆలయం ఉంచి విజయనగరం గజపతుల కోట వరకు సిరిమాను ఊరేగింపు సాగుతోంది. ఏపీ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో రూ.1.30 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేశారు.