అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mining | నిజామాబాద్ నగర శివారులోని మోపాల్ మండలం(Mugupal mandal)లో మొరం అక్రమ తవ్వకాలు ఏ మాత్రం ఆగట్లేదు. రెవెన్యూ అధికారుల(revenue officers) అండదండలతో స్థానిక కాంగ్రెస్ నాయకులు(Congress leaders) దర్జాగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు చెప్పారనే కారణంతో తాత్కాలికంగా అనుమతులు ఇచ్చి గుట్టలు కొల్లగొట్టేస్తున్నారు. అక్రమ మైనింగ్(Illegal mining) అని తెలిసినా అధికార పార్టీ నాయకులు కావడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం.
టీజీఎండీసీ(TGMDC) నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ లేదా ప్రైవేటు స్థలంలో మొరం తవ్వకాలు చేపట్టాల్సి వస్తే ముందుగా మైనింగ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. సంబంధిత మొరం ఉన్న ప్రాంతం లేదా గుట్టకు సంబంధించిన జియోలాజికల్ సర్వే పూర్తిచేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్(Environmental clearance) తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మైనింగ్ శాఖ (Mining Department) నుంచి డీడీ స్థాయి అధికారి సిఫార్సు మేరకు ఏడీ తాత్కాలిక లేదా పూర్తిస్థాయి(ఐదేళ్ల గడువు)తో తవ్వకాలకు సంబంధించిన లీజు అనుమతులిస్తారు. ఇదే నిబంధన ప్రతిఒక్కరికి వర్తిస్తుంది. కానీ గత కొద్దిరోజులుగా మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి, సిర్పూర్ గ్రామాల శివారులలో నిబంధనలు తుంగలో తొక్కి మొరం అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ఏకంగా గుట్టలను మాయం చేసేస్తున్నారు.
Mining | కలెక్టర్ దృష్టిలో ఉందని చెప్పి..
ఇక్కడ మొరం అక్రమ తవ్వకాలపై ‘అక్షరటుడే’ వరుస కథనాలు ప్రచురిస్తోంది. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు కలెక్టర్ దృష్టిలో ఉందని.. ఆయన మౌఖిక ఆదేశాల మేరకే ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని మోపాల్ మండల తహశీల్దార్ వివరణ ఇవ్వడం కొసమెరుపు. నిజానికి కలెక్టర్ లేదా ఆర్డీవో మౌఖిక ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ.. మైనింగ్ యాక్ట్ ప్రకారం మొరం తవ్వకాలకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఉండదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ పనుల కోసం మాత్రమే మైనింగ్ చేపట్టవచ్చు. కానీ స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేరు చెప్పి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మొరం దందా సాగిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవచూపి మొరం అక్రమ తవ్వకాలను జరుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.