అక్షరటుడే, నిజామాబాద్ రూరల్ : mining | నిజామాబాద్(Nizamabad City)కు కూతవేటు దూరంలో మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మోపాల్ మండలంలోని సిర్పూర్ –మల్లారం(Sirpur-Mallaram) పరిధిలో గల ఓ గుట్ట నుంచి అక్రమార్కులు దర్జాగా మొరాన్ని తోడేస్తున్నారు. పట్టపగలే అక్రమ మైనింగ్(illegal mining) జరుగుతున్నప్పటికీ పోలీస్(police), రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
బుధవారం మధ్యాహ్నం సంబంధిత అక్రమ మైనింగ్ జరుగున్న ప్రాంతానికి ‘అక్షరటుడే’(Akshara Today) ప్రతినిధి వెళ్లగా.. తమకు అనుమతులు ఉన్నాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. తీరా స్థానిక అధికారులను సంప్రదించేలోపు అక్రమార్కులు యంత్రాలు, టిప్పర్లను అక్కడి నుంచి తరలించి పలాయనం చిత్తగించారు.
కాగా.. సిర్పూర్–మల్లారం(Sirpur-Mallaram) పరిధి నుంచి గత కొన్నిరోజులుగా మొరం(moram) అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి(MLA Bhupathi Reddy) పేరు చెప్పుకుని కొందరు పగలు, రాత్రిళ్లు తవ్వకాలు జరుపుతున్నారు. పైగా వీరిలో ఏ ఒక్కరికీ కూడా అనుమతులు లేవు. అయితే ఎమ్మెల్యే తనకు చెప్పారని ఒకరిద్దరికి అనుమనుతులిచ్చినట్లు స్థానిక తహశీల్దార్ వివరణ ఇవ్వడం కొసమెరుపు.
వాస్తవానికి అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం(government) సీరియస్‌గా ఉంది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కొత్తగా వచ్చిన సీపీ సాయిచైతన్య సైతం కఠినంగా వ్యవహరిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయి అధికారులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖతో విచారణ చేయించాల్సిన అవసరం ఉంది.