అక్షరటుడే, ఆర్మూర్: పెర్కిట్ శివారులో ఆదివారం ఇసుక లారీని అధికారులు సీజ్ చేశారు. వే బిల్లు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని గుర్తించిన స్థానిక ఇసుక వ్యాపారులు ఈ విషయమై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ బి.నాగేశ్వర్ విచారణ జరిపి లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.