అక్షరటుడే, వెబ్‌డెస్క్ Telangana : ప్రతి ఏడాది ఏప్రిల్‌లో మనకు ఎండ వేడిమి ఎక్కువగా తెలుస్తుంది. కాని ఈ సారి ఫిబ్రవరి నుండి ఎండలు మండుతున్నాయి. పూర్తి వేసవి ప్రారంభానికి ముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7-8 గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆశ్చర్యాన్ని కలిసిగిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయపడిపోతున్నారు.
Telangana : దంచుతున్న ఎండ..
మార్చి రెండో రావడంతో ఎండల తీవ్రత క్రమేపి పెరుగుతోంది. పగలంతా ఎండ, ఉక్కపోత ఉండగా, తెల్లవారుజామున చల్ల గాలులు వీస్తుండడం కాస్త ఉపశమనం కలిగిస్తంఉది… మరో వారం, పది రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగనున్నాయి. నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని.. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ఎండ వేడిమికి కూలర్లు, ఏసీలు, టేబుల్ ఫ్యాన్ల విక్రయాలు పెరిగాయి.
ఒక్కో ఏసీ సర్వీసింగ్‌కు రూ.500-800 వరకు వసూలు చేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో ఫోన్ చేసిన మూడు, నాలుగు రోజులకు మెకానిక్‌లు వస్తున్నారు. వాహనదారులు ఎండలకు చాలావరకు తమ ప్ర యాణాలు తగ్గించు కుంటున్నారు. దీంతో మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రంతో పాటు, జాతీయ రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలో బయట తిరిగేవాళ్ళు తమ దాహార్తిని తీర్చుకునేందుకు రోడ్లపై విక్రయించే కొబ్బరి బోండాలు, చెరుకు, పండ్ల రసాలు, లస్సీ, మజ్జిగలుతీసుకుంటూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో పెద్దఎత్తున పానీయాల విక్రయాలు సాగుతుండడా, చెరుకు రసం బండ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలానే సొడా, మజ్జిగ కేంద్రాలు వెలుస్తున్నాయి. అయితే చిన్న పిల్లలు, ముసలి వాళ్లు ఎండకి జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.