అక్షరటుడే, నిజాంసాగర్: AI EDUCATION | ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం ప్రభుత్వం ఏఐ బోధన అమలు చేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(COLLECTOR ASHISH SANGWAN) అన్నారు. శనివారం నిజాంసాగర్(NIZAM SAGAR) మండలంలోని అచ్చంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏఐ పాఠాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(Ai) సాయం తీసుకుంటుందన్నారు. జిల్లాలోని ప్రతి మండలానికి ఒక్కో పాఠశాలను ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. అనంతరం గ్రామంలో రెండు రోజుల కిందట ప్రారంభించిన చలివేంద్రాన్ని సందర్శించారు. అలాగే నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, హౌసింగ్ పీడీ విజయ పాల్ రెడ్డి, డీఈ గోపాల్, డీఈవో రాజు, తహశీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలాల ఎంఈవోలు తిరుమలరెడ్డి, అమర్ సింగ్, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.