అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : డిజిటల్‌ క్రాప్‌ సర్వేకు వ్యతిరేకంగా అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్లు (ఏఈవో) గళమెత్తారు. శామీర్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పేరిట ఏఈవోలు సమావేశమై తమ సమస్యలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టనున్న డిజిటల్‌ క్రాప్‌ సర్వే చేపట్టలేమని ఏఈవోలు తేల్చిచెప్పారు. ఈ సందర్బంగా ఏఈవో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగంలో చేరిన 7 సంవత్సరాల్లో అనేక వ్యవసాయ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, రైతుబంధు, రైతుబీమా, రైతువేదికల నిర్మాణాలు అమలు చేశామని పేర్కొన్నారు.