Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఢిల్లీలో భార్య వేధింపులతో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ – కళ్యాణ్ విహార్‌ ప్రాంతానికి చెందిన పునీత్ ఖురానా(40), అతని భార్య మానికా జగదీశ్ పహ్వా ఇద్దరు కలిసి ఉడ్‌బాక్స్ కేఫ్ అనే బేకరి నడుపుతున్నారు. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. విడాకులు తీసుకోగా, ఆ కేసు కోర్టులో నడుస్తోంది. అయినా కూడా పునీత్‌ను అతని భార్య మానికా వేధింపులకు గురిచేసింది. ‘మనం విడాకులు తీసుకున్నాం.. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే.. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే’ అంటూ పట్టుబట్టింది. దీంతో పునీత్ తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. పునీత్ ఫోన్‌లో తన భార్యతో మాట్లాడిన 16 నిమిషాల కాల్ రికార్డ్‌ను గుర్తించారు. విచారణకు హాజరు కావాలని పునీత్ భార్యకు నోటీసు పంపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Harsh Goenka | ధనవంతులు కావాలా.. అయితే ఇలా చేయండి