అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: దీపావళి సందర్భంగా పటాకుల దుకాణాదారులు తప్పకుంటా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఇన్‌ఛార్జి సీపీ సింధు శర్మ పేర్కొన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పటాకుల దుకాణాదారులు ఏసీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా దుకాణాలు నిర్వహిస్తే ఎక్స్‌ప్లోజివ్‌ యాక్ట్‌ ప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాలను రద్దీ ప్రాంతాల్లో నెలకొల్పవద్దని, ఎన్‌వోసీ తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను www.nizamabadpolice.in లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఏసీపీ కార్యాలయంలో సమర్పించాలన్నారు.