అక్షరటుడే ఇందూరు: గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తున్నట్లు ఇంఛార్జి సీపీ సింధు శర్మ తెలిపారు. ఈనెల 17, 18న జరిగే పరీక్షలకు జిల్లాలో మొత్తం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఏసీపీ, సీఐ, ఎస్ హెచ్ఓ, ఎస్ఐలను ఆదేశించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 మీటర్లలోపు ఉన్న జిరాక్స్ దుకాణాలు మూసి వేయించాలని సూచించారు. అలాగే 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు ఒక్కో పోలీస్ అధికారిని కేటాయించినట్లు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు
Advertisement
Advertisement