అక్షరటుడే, ధర్పల్లి: మండల కేంద్రంలో అనూష(26) అనే యువతిని కట్టుకున్న భర్త లక్ష్మాపురం వినోద్ పథకం ప్రకారం హత్య చేసి పరారీలో ఉన్నాడని కుటుంబీకులు ఆరోపించారు. నిందితుడు వచ్చేంతవరకు అంత్యక్రియలు నిర్వహించబోమని మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. వీరితో పాటు హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు మద్దతు తెలిపారు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, న్యాయం జరిగేంత వరకు పోరాడతామని బంధువులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement