అక్షరటుడే, ఆర్మూర్ : సిద్దిపేట మున్సిపాలిటీలో ఆర్మూర్ మున్సిపల్ అధికారులకు గురువారం పలు అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వచ్ఛ బండి కెపాసిటీ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్, బయో సీఎన్ జీ, విండ్రా కంపోస్టింగ్ డీఆర్సీ మెయింటెనెన్స్, ఐటీసీ పొడి చెత్త తడి చెత్త ఎలా ఉపయోగించాలి, ఎలా స్టోర్ చేయాలని వివరించారు. చెత్త తో ఎలా గ్యాస్ తయారు చేయాలో డీఆర్సిసీ సెంటర్స్ లో పరికరాలను ఎలా వాడాలనే అంశాలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, భీమ్ గల్, మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ నవీన్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఓంకార్, మధు పాల్గొన్నారు.

Advertisement
Advertisement