అక్షరటుడే, వెబ్‌డెస్క్: తమిళనాడులో మళ్లీ హిందీ భాషపై రగడ మొదలైంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాస వేడుకలు నిర్వహించడం ఎందుకుని ప్రశ్నిస్తూ సీఎం స్టాలిన్ పీఎం మోదీకి శుక్రవారం లేఖ రాశారు. దూరదర్శన్‌లో హిందీ మాస వేడుకలను నిర్వహించడాన్ని ఆయన తప్పు పట్టారు. స్థానికంగా ఉన్న భాషకే మాస వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఏ భాషకు జాతీయ హోదా కల్పించలేదన్నారు.