అక్షరటుడే, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 2.94 లక్షల కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు, ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు, రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లుగా నిర్ణయించారు.
గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం..
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.16.739 కోట్లు, జలవనరులు రూ.16,705 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు, ఇంధన రంగానికి రూ.8,207 కోట్లు, పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు, నిరుపేదల గృహ నిర్మాణానికి రూ.4,012 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లు, అటవీ పర్యావరణ శాఖకు రూ.687 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ.1,215 కోట్లు కేటాయించారు.
గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. తదుపరి మైనార్టీలకు ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి. ఎస్టీ సంక్షేమానికి రూ.7,557 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.3,907 కోట్లు కేటాయించడం గమనార్హం.