అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సైబర్‌ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్‌ యూజర్లకు ప్రైవసీ ఇంప్రూవ్‌ చేయడంపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ఫేక్‌ వార్తలు, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించింది. ఒక్క ఆగస్టు నెలలోనే 80 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేశామని వాట్సాప్‌ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. భారత ఐటీ రూల్స్‌-2021 ప్రకారం చర్యలు తీసుకున్నామని ప్రకటించింది.