అక్షర టుడే, వెబ్ డెస్క్ Bhagavad Gita : భగవద్గీతలో శ్రీకృష్ణుడు హితబోధ చేస్తూ… మనుషుల్లో నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది.. స్వచ్ఛమైన ప్రేమ గురించి బోధించాడు. స్వచ్ఛమైన భావన, ప్రేమలో ఏ విధమైన స్వార్థం లేకుండా ఉండడం, ఎదుటి వారి పట్ల మంచిని కోరేవారు, ఎప్పుడు సంతోష పడడం చూసి ఆనందించేవారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రేమ నిజమైన అర్ధాన్ని వివరించారు. ఇది త్యాగం, అంకిత భావం, క్షమ అనే ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంటుంది.
ప్రేమ అనేది మనసులో నుంచి వచ్చే స్వచ్ఛమైన భావన. ఎదుటివారి పట్ల ఎలాంటి స్వార్థం లేకుండా ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం నిజమైన ప్రేమకు అర్థం. కాలం ఎలా మారినా, పరిస్థితులు చేయి దాటిన వారిపై ప్రేమ భావన మాత్రం ఎప్పటికీ మారకూడదు. నిజమైన ప్రేమ అనేది మన దగ్గర ఉన్న దాన్ని పంచుకోవడం, ఎదుటివారి సంతోషంలో మన సంతోషం చూడడం. కేవలం ఒక ఫీలింగ్ మాత్రమే కాదు, జీవితాన్ని మార్చే గొప్ప అనుభూతి కూడా.
శ్రీకృష్ణుడు ప్రేమ నిజమైన అర్ధాన్ని వివరించారు : ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ప్రేమకు ఉన్న అర్ధాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. చాలామంది ప్రేమకు ఒక హక్కుగా చూస్తున్నారు. ఎవరికైనా మనపై ఇష్టం వస్తే వారిని మనమే పొందాలని అహంభావంతో ఉండడం చూస్తున్నాం. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. ఇది మన ఆశలు, స్వార్థంతో కలిసిన భావం మాత్రమే. శ్రీమద్ భగవద్గీత మనకు నిజమైన ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తుంది. ఈ కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ప్రేమ అనేది ఒప్పందం కాదు, లావాదేవీ అసలు కాదు, పూర్తిగా త్యాగంతో కూడినది, అంకిత భావం కలిగి ఉండాలి. నేను ప్రేమలో అహం అనే భావం ఉండదు. ఒకరికి సంపూర్ణంగా అర్థం చేసుకొని తమని తామే మరిచిపోయి వాళ్ళ మంచి కోసం మనం చేసే త్యాగమే అసలైన ప్రేమకు నిజమైన అర్థం.
ఏమంటే ఎదుటివారి నుండి ఏమీ ఆశించకుండా జీవించగలడం, మనకున్న దానితో సంతోషించగలగడం. త్యాగం చేయగల మనసు ఉండే వ్యక్తి ప్రేమను పవిత్రంగా నిలబెట్టగలడు. ప్రేమకో ప్రతిఫలం ఆశించకపోతేనే అది ఆధ్యాత్మిక సాయికి చేరుకుంది. ప్రేమకు బదులుగా ఏదైనా ఆశించడం వల్ల అది స్వార్థంతో కలిసినా భావనగా మారిపోతుంది. తో ప్రయత్నించిన ప్రేమను పొందలేకపోతే మనం తలకిందులు అవ్వాల్సిన పనిలేదు. భగవద్గీత ప్రకారం ఆ భావన భగవంతుని పాదాల చెంత ఉండాలి. ప్రేమ ఒక వ్యక్తితో ఆగిపోదు. అది ఒక దానిని విడిచి మరవదానికి అనుసరిస్తుంది. అప్పుడు ఆ ప్రేమ భగవంతునితో మన సంబంధానికి మూలంగా మారుతుంది. దీని భక్తిగా మారిన ప్రేమగా చెప్పవచ్చు. భగవద్గీతతో శ్రీకృష్ణుడు చెప్పినట్లు, దేవుడి అసలైన స్వరూపాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు వారు బాధపడరు. లోపాలు లేకుండా నిబ్బరంగా ఉంటారు. ఎవరో ఒకరిపై నిస్వార్ధ ప్రేమ చూపిస్తూ.. తన మనసునే ప్రేమగా మార్చుకున్న వాడు కూడా ఎవరి ప్రేమ కోసం తపించడు.
ఎందుకంటే అతని హృదయం అప్పటికే దైవ ప్రేమతో నిండిపోతుంది. అది అంతర్గత సంతోషాన్ని అనుభవించే స్థితి. భగవద్గీతలో చెప్పిన ముఖ్యమైన విషయం ఏమిటంటే. ప్రేమలో ఫలితం ఆశించకూడదు. ప్రేమ అనేది లావాదేవీ కాదు. త్యాగం క్షమా అంకితభావంతో కూడిన జీవిత మార్గం. వారికోసం అయినా త్యాగం చేయగల స్వామయం ఉన్నవాడు నిజంగా ప్రేమను అర్థం చేసుకున్నవాడు అవుతాడు. ప్రేమ అంటే స్వచ్ఛత, త్యాగం, అంకిత భావం, ఇది ఎప్పటికీ మారని ఆధ్యాత్మిక విలువ. భగవద్గీత ద్వారా మనకు ప్రేమలోని నిజమైన అర్థం తెలుస్తుంది.మనం ప్రేమను ఎలా చూపించాలో, ఎలా నిస్వార్ధంగా జీవించాలో ఇది బోధిస్తుంది. నీ ప్రేమను మన జీవితంలో మారదర్శకంగా తీసుకుంటే మన జీవితంలో సంతోషం, శాంతి ఉంటుంది.