అక్షరటుడే, భీమ్‌గల్‌: లింబాద్రి నర్సింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్‌ ఛైర్ పర్సన్‌ ప్రేమలత సురేందర్‌, కమిషనర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారిపై పేరుకుపోయిన మట్టి తొలగింపు పనులు చేపట్టారు. కార్యక్రమంలో జూనియర్‌ అసిస్టెంట్‌ నవీన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఓంకార్‌, డ్రైవర్‌ మధు, దేవిలాల్‌, విజయ్‌కుమార్‌, వికాస్‌, జవాన్‌ రాజన్న పాల్గొన్నారు.