అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం వీరాపూర్ గ్రామంలో ఓ బాలికకు కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి సిద్ధమవగా అధికారులు అడ్డుకున్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మోహన్, సీడీపీవో సౌభాగ్య, సూపర్ వైజర్ సుమలత, అంగన్వాడీ టీచర్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని సూచించారు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు చేస్తామని హెచ్చరించారు. బాలికను కామారెడ్డి బాల సదన్‌కు తరలించారు.