Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి రూరల్: గ్రామాల్లో జాతకాలు చెప్తామంటూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన లింగంపేట మండలం కోమటిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తులు కోమటిపల్లిలో సంచరిస్తూ మీ ఇంటికి వాస్తు లేదని, తాయత్తులు కట్టుకోకపోతే మీ కొడుకులు మృతి చెందుతారని భయపెట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Yellareddy | డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం