Advertisement
అక్షరటుడే, బోధన్‌టౌన్: విద్యుత్‌షాక్‌తో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన బోధన్ పట్టణంలోని బైపాస్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైపాస్ రోడ్డులోని ఓ స్వీట్ షాపుపై ఆదివారం మధ్యాహ్నం అర్మాన్ అనే యువకుడు సైన్ బోర్డులు ఫిట్టింగ్ చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. బీహార్‌కు చెందిన అర్మాన్ బోధన్‌లో పనిచేస్తూ నివాసం ఉంటున్నాడు.
Advertisement