అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం కొత్తబాది పంచాయతీ పరిధిలోని సంతోష్ నగర్ తండాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తబాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు ప్రమీల(40) కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతోంది. కాగా కొంత కాలంగా పాఠశాలకు వెళ్లడం లేదు. మానసికంగా కుంగిపోయి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.