అక్షర టుడే, వెబ్ డెస్క్: ఆపి ఉన్న కారు నుంచి నగదు చోరీ అయిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో జరిగింది. లోకేశ్వరం మండలం గడ్ చందకు చెందిన అల్లం భోజన్న సుమారు రూ.1.80 లక్షల నగదును కారులో ఉంచి, పని నిమిత్తం బస్టాండ్ వద్ద ఎస్బీఐ బ్రాంచ్ లోకి వెళ్లగా, కొద్ది సేపటికి బయటికి వచ్చి చూడగా, కారు అద్దం పగులగొట్టి ఉంది. కారులో నగదు బ్యాగ్ కనిపించక పోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.