ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం కవిత ఇంటికి చేరుకుని తనిఖీలు చేస్తోంది. మరోవైపు కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు లిక్కర్‌ స్కాం కేసుపై సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ వాయిదా పడిన విషయం తెలిసిందే. మరోవైపు విచారకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసినప్పటికీ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున హాజరుకాలేనని దర్యాప్తు సంస్థకు కవిత లేఖ రాశారు. తాజాగా ఐటీ సోదాలు జరుగుతుండడం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.