అక్షరటుడే, వెబ్డెస్క్ : Passenger Vehicles | దేశంలో ఆటో మొబైల్ రంగం క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్ (Passenger vehicles) విక్రయాలు పెరిగాయి. 2015 నుంచి 2019 వరకు ప్యాసింజర్ వెహికల్ విక్రయాలు పెరుగుతూ వచ్చాయి. తర్వాత కరోనా (Corona)తో ఆటో మొబైల్ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంది. ముఖ్యంగా ప్యాసింజర్ వెహికల్(PV) అమ్మకాలు(Sales) భారీగా పడిపోయాయి.
2019 ఆర్థిక సంవత్సరంలో 3.38 మిలియన్ల యూనిట్లు అమ్ముడు పోగా 2020లో 2.77 మిలియన్లకు పడిపోయింది. అనంతరం 2022 నుంచి మళ్లీ వాహనాల అమ్మకాలు జోరు అందుకున్నాయి. అయితే 2024-25 (FY25)లో గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 2.6 శాతం పెరిగి 4.34 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి.
గతేడాది వాహన విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైంది. దీనికి కారణం అంతకు ముందు కరోనాతో అమ్మకాలు పడిపోవడం. అయితే ప్రస్తుతం 2.6శాతం మాత్రమే ప్రయాణికుల వాహనాల అమ్మకాలు పెరిగాయి.