అక్షరటుడే, న్యూఢిల్లీ: India Justice Report : న్యాయం అందించడానికి సంబంధించి భారత్లో రాష్ట్రాలకు ర్యాంకింగ్ అందించే ఏకైక నివేదిక అయిన 2025 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) రిలీజ్ అయింది. ఈ నివేదికలో తెలంగాణ(Telangana) రాష్ట్రం టాప్లో ఉంది. పోలీసు రంగంలో 1వ స్థానంలో, న్యాయవ్యవస్థలో 2వ స్థానంలో తెలంగాణ ఉంది. మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాల పరిధి(కోటి కంటే ఎక్కువ జనాభా)లో 3వ స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) జైళ్ల శాఖలో 4వ స్థానంలో, చట్టపరమైన సహాయంలో 5వ స్థానంలో ఉంది. మొత్తం మీద 18 పెద్ద, మధ్య తరహా రాష్ట్రాలను తీసుకుంటే.. 2వ స్థానంలో నిలిచింది.
ఇండియా జస్టిస్ రిపోర్ట్(IJR)ను టాటా ట్రస్ట్స్ మొదట ప్రారంభించింది. మొట్టమొదటి ర్యాంకింగ్ 2019 లో వెలువడింది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్(Centre for Social Justice), కామన్ కాజ్(Common Cause), కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్(Commonwealth Human Rights Initiative), DAKSH, TISS–Prayas, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ(Vidhi Centre for Legal Policy), ఐజేఆర్ డేటా భాగస్వామి(IJR Data Partner) అయిన హౌ ఇండియా లివ్స్(India Lives) వంటి భాగస్వాముల సహకారంతో ఈ నివేదిక విడుదల చేశారు.
India Justice Report | పోలీస్ శాఖకు సీఎం రేవంత్ అభినందనలు
అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడంతో సీఎం రేవంత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. తెలంగాణకు గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు. ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.