అక్షరటుడే, ఇందూరు: ఒలింపిక్ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఓటమి పాలైంది. ఎన్నో ఆశలతో పారిస్ లో అడుగు పెట్టిన ఈ స్టార్ బాక్సర్ ఓటమి తర్వాత కన్నీటి పర్యంతం అయ్యింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్లో చైనా క్రీడాకారిణి వు యూ చేతిలో 5-0 తో వెనుదిరిగింది. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన నిజామాబాద్ వాసి నిఖత్ కు ఇదే తొలి ఒలింపిక్స్. ఇదిలా ఉండగా ఎన్నో ఆశలతో పారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టిన బాక్సర్ నిఖత్ జరిన్ ఓటమితో భావోద్వేగానికి గురైంది. ‘ఈ అనుభవం కొత్త పాఠం నేర్పింది. నేను ఇంతకుముందు వూ యూ తో తలపడలేదు. తను చాలా వేగంగా కదిలింది. కష్టపడి ఇక్కడిదాకా చేరుకున్నాను. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తాను’ అని పేర్కొంది.