అక్షరటుడే, వెబ్‌డెస్క్ : భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లడఖ్ లేహ్ లో ఈరోజు ప్రారంభించింది. హ్యుమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్,ఆకా స్పేస్ స్టూడియో, లడఖ్ విశ్వవిద్యాలయం, ఐఐటీబాంబే లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈమిషన్‌ను చేపట్టింది. మిషన్‌లో భాగంగా ఇస్రో లేహ్ లో ఓస్పేస్‌ను సృష్టిస్తుంది. ఇందులో మరో గ్రహంలో పరిస్థితులు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. దీంతో భూమికి దూరంగా ఉన్న ప్రదేశాల్లోని బేస్ స్టేషన్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇస్రో సన్నాహాలు చేయనుంది. భారత చరిత్రలో ఈమిషన్ మరో మైలురాయిగా నిలవనుంది.