భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్సీ సెనెక్స్‌ ఉదయం సుమారు 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల నష్టాల్లో ప్రారంభమయ్యా యి. మధ్యాహ్నం 2 గంటల వరకు సూచీలు మరింత దిగజారాయి. సెన్సెక్‌ 725, నిఫ్టీ 231 పాయింట్లకు పడిపోయాయి. అమెరికా ఫెడ్‌ సమావేశం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపింది. దీంతో అధిక వెయిటేజీ ఉన్న టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌లో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా పతనమయ్యాయి. అలాగే మిడ్‌క్యాప్‌, స్మాల్‌కాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. విదేశీ ఇన్వెస్టర్లు సైతం అమ్మకాలకు దిగడం మరో కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా అంతర్జాయతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చివరకు సెన్సెక్‌ 736, నిఫ్టీ 238 పాయింట్ల నష్టంతో మార్కెట్‌ క్లోజ్‌ అయ్యింది.